Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లల కోసం వ్యాక్సిన్-కోవాక్సిన్ టీకాకు అనుమతి!

పిల్లల కోసం వ్యాక్సిన్-కోవాక్సిన్ టీకాకు అనుమతి!
, మంగళవారం, 12 అక్టోబరు 2021 (14:44 IST)
దేశవ్యాప్తంగా కరోనా ధర్డ్ వేవ్ భయాలు నెలకొంటున్న వేళ కేంద్రం ఇవాళ మరో వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది. అయితే తొలిసారిగా పిల్లల కోసం రూపొందించిన వ్యాక్సిన్ కు ఈ అనుమతి లభించింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్ధ రూపొందించిన ఈ చిన్నారుల వ్యాక్సిన్ ను కరోనాపై పనిచేస్తున్న నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్ చిన్నారుల టీకా అత్యవసర పరిస్దితుల్లో వాడకానికి కోవిడ్ నిపుణుల కమిటీ అనుమతి మంజూరు చేసింది. 
 
రెండేళ్ల వయస్సు నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలకు ఈ టీకాను వాడేందుకు అనుమతి లభించింది. భారత్ బయోటెక్ 18 ఏళ్ల లోపు వయస్సున్న చిన్నారులపై రెండు, మూడు దశల ప్రయోగాలను సెప్టెంబర్ లో పూర్తి చేసింది. ఆ తర్వాత అనుమతి కోసం డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది. దీంతో ఈ ప్రయోగాల ఫలితాలను పరిశీలించిన కేంద్రం.. అత్యవసర వాడకం కోసం అనుమతి మంజూరు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోర్టు ఆదేశించినా కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు ఎందుకు చెల్లించ‌రు?