Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో 66మందికి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా లేకుంటే..?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (11:06 IST)
హైదరాబాదులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా కూకట్‌పల్లి ప్రాంతంలో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 13, హస్మత్‌పేటలో 14, ఎల్లమ్మబండలో 8, మూసాపేటలో 2, పర్వత్‌నగర్‌లో 3, బాలానగర్‌లో 23, జగద్గిరిగుట్టలో ముగ్గురికి చొప్పున పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.
 
అలాగే కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో గురువారం 396 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 44కి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కుత్బుల్లాపూర్‌ యూపీహెచ్‌సీలో 12 మందికి, గాజులరామారం యూపీహెచ్‌సీలో ముగ్గురికి, షాపూర్‌నగర్‌ యూపీహెచ్‌సీలో 19 మందికి, సూరారం యూపీహెచ్‌సీలో నలుగురికి, దుండిగల్‌ పీహెచ్‌పీలో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి వై.నిర్మల తెలిపారు.
 
ఓల్డుబోయినపల్లి డివిజన్‌ పరిధిలో గురువారం 75మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హస్మత్‌పేటలో 64 మందికి పరీక్షలు నిర్వహించగా 14మందికి, అంజయ్య నగర్‌లో 11 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకపోతే..కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments