Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మైండ్ స్పేస్' ఖాళీ అయిందా?.. జయేశ్ రంజన్ ఏమన్నారు?

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (08:57 IST)
తెలుగు రాష్ట్రాల ప్రజలను కరోనా వైరస్ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో ప్రజలంతా హడలిపోతున్నారు. అదేసమయంలో ఇప్పటివరకు ఈ వైరస్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాలకు వెళ్లివచ్చిన వారికే సోకింది. దీంతో టెక్కీలంతా బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందకుండా ఐటీ కంపెనీల యాజమాన్యాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కూడా కల్పించాయి. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని డీఎస్ఎం ఐటీ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. దీంతో హైటెక్ సిటీ ప్రాంతంలోని రహేజా మైండ్ స్పేస్ మొత్తం ఖాళీ అయిందన్న వార్తలు హల్చల్ చేశాయి. ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ స్పందించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మైండ్ స్పేస్‌లోని బిల్డింగ్ నెంబర్ 20లోని తొమ్మిదో ఫ్లోర్‌లో డీఎస్ఎం కంపెనీ ఉందని, అక్కడి ఉద్యోగులను మాత్రమే బుధవారం ఇంటికి పంపారని చెప్పారు. అంతే తప్ప ‘మైండ్ స్పేస్’లో ఉన్న అన్ని బిల్డింగ్‌లు ఖాళీ అయిపోతున్నాయంటూ అసత్య ప్రచారం జరిగిందని చెప్పారు. రేపటి నుంచి ‘మైండ్ స్పేస్’లోని అన్ని కార్యాలయాలు యథాతథంగా నడుస్తాయని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments