Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. అలా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా?

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (13:15 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ బారినుంచి ప్రజలను రక్షించేందుకు ఆయా దేశాలు సంపూర్ణ లాక్‌డౌన్లు ప్రకటించాయి. అయినప్పటికీ... ఈ కరోనా గొలుసు కట్టును ఆపలేకపోతున్నారు. పైగా, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోంది. అంతేకాకుండా, కరోనా వైరస్ గాలిద్వారా వ్యాపించే వైరస్ కాకపోయినప్పటికీ... కరోనా వైరస్ బారినపడినవారిని తాకితే సోకే అంటువ్యాధిగా వైద్యులు తేల్చారు. 
 
అయితే, ఇపుడు కళ్ళద్వారా కూడా ఈ వైరస్ సోకుతుందనే ప్రచారం సాగుతోంది. అందువల్ల కరోనా వైరస్‌ వ్యాప్తిలో కళ్లు ముఖ్యపాత్ర వహిస్తున్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నైలోని ప్రముఖ నేత్ర చికిత్సాలయమైన అగర్వాల్ కంటి ఆస్పత్రి వైద్యసేవల విభాగం డాక్టర్‌ ప్రీతి రవిచందర్‌ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్‌ను నివారించడంలోనూ, వ్యాపింపజేయడంలోనూ కళ్లు ముఖ్య పాత్ర వహిస్తున్నాయన్నారు. వ్యక్తులు దగ్గినప్పుడు నీటి కణాలు కంట్లోకి పడినా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందన్నారు. 
 
ఈ వైరస్‌ దేహంలోని అన్ని భాగాలకు చేరుతుందని, తద్వారా ప్రాణాపాయం కలుగుతుందని వివరించారు. సబ్బుతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, వేడి నీరు, వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదన్నారు. నీటిని వీలైనంత ఎక్కువసార్లు తాగాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments