Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి .. కొత్తగా 3.11 లక్షల కేసులు

Webdunia
ఆదివారం, 16 మే 2021 (10:38 IST)
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,11,170 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. అయితే, పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మరోసారి నాలుగువేలకుపైగా నమోదయ్యాయి. ఒకే రోజు 4,077 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 
 
మరో వైపు వైరస్‌ నుంచి బాధితులు భారీగా కోలుకున్నారు. 24 గంటల్లో 3,62,437 మంది డిశ్చార్జి అయ్యారని కేంద్రం పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,46,84,077కు చేరగా.. ఇప్పటివరకు 2,07,95,335 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 2,70,284 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. 
 
ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్‌ కేసులున్నాయని, టీకా డ్రైవ్‌లో భాగంగా 18,22,20,164 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలావుండగా, శనివారం ఒకే రోజు 18.32లక్షల కొవిడ్‌ టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటివరకు 31.48 కోట్లు టెస్టులు చేసినట్లు వివరించింది. మరోవైపు, కరోనా వైరస్ సోకి కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతవ్ కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments