Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా థర్డ్ వేవ్ దూసుకొస్తుందా? మార్గమేంటి?

కరోనా థర్డ్ వేవ్ దూసుకొస్తుందా? మార్గమేంటి?
, శనివారం, 15 మే 2021 (16:41 IST)
కరోనా వైరస్ వయస్సుతో సంబంధం లేకుండా సోకుతోంది. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా కబళిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధులే కాకుండా యువతపై తీవ్ర ప్రభావం చూపింది. మొదటి దశలో వృద్ధులు, రెండవ దశలో యువతపై పంజా విసిరింది. లెక్కకు మించి మరణాలు సంభవించాయి.
 
వాటి నుంచి కోలుకోకముందే మరో ముప్పు పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశలో చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. తొలి, మలిదశ కంటే మూడవ దశ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. గత రెండురోజుల నుంచి కేసులు తగ్గుముఖం పట్టినా మరణాల సంఖ్య మాత్రం పెరుగుతున్నాయి.
 
రికవరీ రేటు కూడా భారీగా పెరుగుతోంది. సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుందో అంతుచిక్కడం లేదు. అయితే మూడవదశ చాలాప్రమాదకరంగా మారుతోందనే అంచనాలు జనానికి నిద్రపట్టనీయడం లేదు. మూడవ దశ అత్యంత ప్రమాదకరమంటున్నారు. 
 
ఫస్ట్ వేవ్‌లో ఒక్కశాతం కంటే తక్కువమంది పిల్లలకు కరోనా సోకగా, సెకండ్ వేవ్‌లో మాత్రం పిల్లల్లో సంక్రమణ రేటు 10 శాతం రేటు పెరిగింది. పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ ఇవ్వలేదు. దీంతో చిన్నారులకు 80 శాతం వరకు ప్రమాదం ఉండొచ్చు అంటున్నారు. మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్లు వాడటం పిల్లలకు పెద్దగా తెలియదు. 
 
అర్థం చేసుకునేంత స్థాయి కూడా ఉండదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ వేగంగా విస్తరించే అవకాశాలు ఉందంటున్నారు. ఈ నెల చివరికి కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి మూడవదశ.. జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోటుకు అడుగు భాగంలో చిల్లులు.. మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్స్