Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా.. ఏపీలో లక్ష దాటింది.. తెలంగాణలో 1,473 కేసులు

Webdunia
సోమవారం, 27 జులై 2020 (20:08 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష దాటగా, కరోనా మృతుల సంఖ్య 1000 దాటింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6,051 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,210 కేసులు రాగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 120 కేసులు గుర్తించారు. 
 
ఈ నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,349కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరో 49 మంది మృతి చెందగా, ఇప్పటివరకు సంభవించిన మరణాల సంఖ్య 1,090కి పెరిగింది. తెలంగాణలో కోవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. 
 
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 9,817 మంది నమూనాలను పరీక్షించగా, వారిలో 1,473 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 506 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,532 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 12,955 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 42,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 471కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments