తెలంగాణాలో కరోనా పరుగు - లక్ష కేసులకు చేరువలో... దేశంలోనూ అంతే...

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (09:58 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. రాష్ట్రంలో కొత్తగా 1,967 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అదేసమయంలో 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1781 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391కి చేరింది. ఆసుపత్రుల్లో 21,687 మందికి చికిత్స అందుతోంది. అలాగే, 76,967 మంది డిశ్చార్జ్ కాగా, మృతుల సంఖ్య మొత్తం 737కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 473 మందికి కొత్తగా కరోనా సోకింది. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,48,078 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 
 
ఇకపోతే, దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 68,898 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 983 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 29,05,824కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 54,849కి పెరిగింది. ఇక 6,92,028 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 21,58,947 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments