Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా అప్‌డేట్: దేశంలో పదివేల మరణాలు.. పదివేల కేసులు..

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (10:11 IST)
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా సోమవారం దేశ వ్యాప్తంగా 380మంది కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 9900కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

ఇక, కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,667 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ బారినపడినవారి సంఖ్య 3,43,091కి చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. 
 
మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,80,013మంది కోలుకోగా మరో 1,53,178మంది చికిత్స పొందుతున్నారు. కానీ దేశంలో వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 52.5శాతంగా ఉంది.
 
ప్రస్తుతం కేంద్రం మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఈ 8 రాష్ట్రాల్లో కరోనా కేసులు 10వేలకు పైగా ఉన్నాయి. ఇకపోతే.. తాజా మరణాల సంఖ్యతో బెల్జియంను దాటి భారత్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానానికి చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో మాత్రం భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments