Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... 100 మంది పోలీసులకు కరోనావైరస్.. ఎక్కడ?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (17:37 IST)
చంద్రగిరి మండలం, కళ్యాణి డ్యామ్ వద్దగల పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సుమారు 100 మంది శిక్షణార్థులు కరోనావైరస్ బారిన పడ్డారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 380 మంది పోలీసులు డిసెంబర్ నుంచి శిక్షణ పొందుతున్నారు. దీంతో కళాశాలను మూసివేసిందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
చంద్రగిరిలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లో వైజాగ్ టౌన్, కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 380 మంది కానిస్టేబుళ్ళు శిక్షణ పొందుతున్నారు. సెప్టెంబర్‌తో వీరి శిక్షణ పూర్తి కానుంది. అయితే లాక్‌డౌన్ సడలింపుతో శిక్షణ పొందుతున్న ట్రైనీలు వారివారి స్వగ్రామాలకు వెళ్ళి వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న ట్రైనీలకు కళాశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు సుమారు 100 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు విశ్వసనీయ సమాచారం. వీరందరినీ సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచినట్లు తెలుస్తోంది. మరికొందరి టెస్టు ఫలితాలు రావాల్సి ఉంది.
 
వైరస్ విస్తృతంగా వ్యాపిచడంతో కాలేజ్‌కు కొంతకాలం సెలవులు ప్రకటించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. రంగంపేట పంచాయతీ సిబ్బంది కళాశాలలో శానిటేషన్, పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments