కరోనా సమయంలో ఐపీఎల్ నిర్వహణ మామూలు కాదు. అంత ఆషామాషీగా తీసుకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదు. బయో సెక్యూర్ వాతావరణంలో చిన్న తప్పిదం జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్‌వాడియా అంటున్నారు.
దుబాయ్‌లో జరుగనున్న ఐపీఎల్-13వ సీజన్‌లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైనా.. లీగ్ మొత్తం నాశనం అవుతుందని పేర్కొన్నాడు.
ఈ ఐపీఎల్‌ను అత్యధిక మంది వీక్షించకపోతే తన పేరు మార్చుకుంటా అన్నారు. ఇది అత్యుత్తమ ఐపీఎల్ కాబోతోంది. ఈ లీగ్‌లో భాగమవ్వకపోతే స్పాన్సర్లు మూర్ఖంగా వ్యవహరించినట్లేనని నెస్ వాడియా తెలిపాడు. ఒక్క పాజిటివ్ కేసు నమోదైనా లీగ్ మొత్తం నాశనం అవుతుందని వాడియా చెప్పుకొచ్చాడు.