Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (10:52 IST)
తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 592 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,81,414కు చేరాయి. కొత్తగా 643 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 2,73,013 మంది డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురు మహమ్మారికి బలవగా మొత్తం మృతుల సంఖ్య 1513కు పెరిగింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 6,888 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 4719 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతంగా ఉందని, రికవరీ రేటు 97.01 శాతానికి చేరిందని వివరించింది. 
 
శనివారం ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 41,970 శాంపిల్స్‌ పరీక్షించామని, ఇప్పటివరకు 64,43,052 నమూనాలను పరిశీలించినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 119, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 70, రంగారెడ్డిలో 57 నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments