దేశంలో 2 లక్షల దిగువకు కరోనా కేసులు.. 44 రోజుల కనిష్ట స్థాయికి

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (10:36 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. 2 లక్షలకు దిగువకు పడిపోయింది. ఇది 44 రోజుల కనిష్ట స్థాయికి సమానం. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,86,364 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 
 
ఆ ప్రకారంగా గురువారం 2,59,459 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,75,55,457కు చేరింది. మరో 3,660 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,18,895కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,48,93,410 మంది కోలుకున్నారు. 23,43,152 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,57,20,660 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
మరోవైపు, దేశంలో గురువారం వరకు 33,90,39,861 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఒక్క గురువారమే 20,70,508 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Disha Patani: రొమాన్స్ జానర్‌లో చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతున్న దిశాపటానీ

ఆటుపోట్లను దాటి బయటకువస్తున్న పరమపద సోపానం విజయం సాధించాలి : భీమనేని శ్రీనివాసరావు

Chittibabu: దర్శకుడు, నటుడు, బీజేపీ నాయకుడు చిట్టిబాబు కన్నుమూత

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments