Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా స్ట్రెయిన్‌ యమ డేంజర్.. జర జాగ్రత్త గురూ... వైద్యుల వార్నింగ్

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (09:00 IST)
బ్రిటన్‌లో కొత్తగా పురుడు పోసుకున్న కరోనా స్ట్రెయిన్‌ ఇపుడు ప్రపంచానికి వణికిస్తోంది. ఈ వైరస్‌ చాలా డేజర్ అంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల బయటకు వెళ్లేటపుడు విధిగా మాస్క్ ధరించాలని వారు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా సమూహాలు ఉన్నచోటికి వెళ్లకపోవడమే మంచిదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
కాగా, ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ వణికిపోతోంది. పైగా, ఈ దేశంలో ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే వేలాది మందిని ఆస్పత్రిపాల్జేసింది. ఈ వైరస్ సోకడం వల్ల చనిపోయేవారి సంఖ్య మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
వచ్చే ఏడాది దీని ప్రభావం గణనీయంగా ఉండబోతోందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన సెంటర్ ఫర్ మేథమేటికల్ మోడలింగ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సంస్థ పరిశోధకులు వెల్లడించారు.
 
ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌తో పోల్చితే ఈ కొత్త స్ట్రెయిన్ 56 శాతం అధికంగా వ్యాపిస్తుందని తేలింది. ఈ వైరస్ ఎంత తీవ్రతతో వ్యాధి లక్షణాలు కలుగజేస్తుందనడానికి ఇప్పటివరకైతే స్పష్టమైన ఆధారాలు లేవని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.
 
బ్రిటన్ ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనిపై ఇదే తరహా అంచనాలు వెలువరించింది. ఇతర కరోనా రకాలతో పోల్చితే ఇది 70 శాతం వేగవంతమైనదని పేర్కొంది. ఇప్పటివరకు ఇది 12 ఉత్పరివర్తనాలకు లోనైందని, కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్లపై ఈ అంశం ప్రభావం చూపుతుందని బ్రిటన్ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పాట్రిక్ వాలన్స్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments