Publish Date: Fri, 18 Dec 2020 (11:54 IST)
Updated Date: Fri, 18 Dec 2020 (11:56 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటికి చేరువైంది. గత 24 గంటల్లో కొత్తగా 22,889 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 99,74,447కు చేరాయి. ఇందులో 95,20,827 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,13,831 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,44,789 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు.
కాగా, గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 338 మంది బాధితులు మరణించగా, 31,087 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
దేశంలో రికవరీ రేటు 95.31 శాతంగా ఉందని, మరణాల రేటు 1.45 శాతం, యాక్టివ్ కేసులు 3.24 శాతంగా ఉన్నాయని తెలిపింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న వారిలో ఐదు రాష్ట్రాల్లోనే 55 శాతం మంది ఉన్నారని వెల్లడించింది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఎక్కువగా ఉన్నారని తెలిపింది.