బంగ్లాదేశ్‌కు భారత్ నిజమైన మిత్రదేశమని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వర్చువల్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1971 యుద్ధంలో బంగ్లాకు మద్దతు ఇచ్చినందుకు దేశానికి, భారత సైన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 'డిసెంబర్ బంగ్లాదేశీయుల్లో ఆనందం, స్వేచ్ఛ, వేడుకల స్ఫూర్తిని రేకెత్తిస్తుందని' అన్నారు.
భారత్ సారథ్యంలో తాము గొప్ప స్వాతంత్య్రాన్ని సంపాదించామన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో మరణించిన మూడు మిలియన్ల మంది అమర జవాన్లకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మా దేశం కోసం తమ హృదయపూర్వక మద్దతును అందించిన ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, బంగబంధు ముజిబుర్ రెహ్మాన్ డిజిటల్ ఎగ్జిబిషన్ ప్రదర్శనను ప్రారంభించారు. అలాగే 55 సంవత్సరాలుగా నిలిచిపోయిన చిలహతి, బెంగాల్ హల్దిబారి రైలు మార్గాన్ని ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు.