దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు... సెకండ్ వేవ్ ముప్పు తప్పినట్టేనా?

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (10:37 IST)
దేశంలో కరోనా వైరస్ వేగం క్రమంగా తగ్గుతోంది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. సోమవారం 44 వేల‌కుపైగా న‌మోద‌వ‌గా, మంగళవారం 37 వేల‌పైచిలుకు కేసులు వ‌చ్చాయి. ఇది సోమ‌వారం కంటే 13.8 శాత త‌క్కువ అని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ తెలిపింది. దీంతో మొత్తం క‌రోనా కేసులు 92 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో నిలిచాయి.
 
దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 37,975 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు సంఖ్య 91,77,841కి చేరాయి. ఇందులో 4,38,667 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 86,04,955 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, 1,34,218 మంది క‌రోనా వ‌ల్ల‌ మ‌ర‌ణించారు. 
 
ఇందులో సోమవారం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గా 480 మంది మ‌ర‌ణించ‌గా, 42,314 మంది కోలుకున్నారు. క‌రోనా రిక‌వ‌రీరేటు 93.75 శాతంగా ఉంది. నిన్న దేశంలో 10.9 ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, అందులో 3.5 శాతం మంది అంటే 37,975 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. 
 
అలాగే, తెలంగాణలో గత 24 గంటల్లో 921 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 1,097 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,049కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,52,565 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,437కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 11,047 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 8,720 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 146 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 61 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెగని 'జన నాయగన్' సెన్సార్ పంచాయతీ.. 21కు వాయిదా

హీరోయిన్ అవికా గోర్ తల్లి కాబోతుందా? ఇంతకీ ఆమె ఏమంటున్నారు?

Balakrishna: అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టుల బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Dimple and Ashika: ప్రతి క్యారెక్టర్ లో ఏదో ఒక తప్పు, లేదా లోపం వుంటుంది : డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్

Samantha: మృదు స్వ‌భావిగా క‌నిపిస్తూ, ఎదురుదాడి చేసేంత శ‌క్తివంతురాలిగా సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వినూత్నమైన ఫ్యాషన్ షోకేస్‌లను నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments