Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు నెలాఖరు వరకు కరోనా లాక్డౌన్ మార్గదర్శకాలు పొడగింపు

Webdunia
గురువారం, 29 జులై 2021 (13:00 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు నిబంధలను పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 
 
పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలను చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కూడా నిబంధనలను పాటించాలని పేర్కొంది.
 
వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జరీ చేసింది. అయితే పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలను సడలించే వెసులుబాటును ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర కల్పించింది. 
 
ఇంకోవైపు, దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 43,509 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,15,28,114కు చేరింది. అలాగే, బుధవారం 38,465 మంది కోలుకున్నారు.
 
ఇక మరణాల విషయానికొస్తే... బుధవారం 640 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,22,662కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,07,01,612 మంది కోలుకున్నారు. 4,03,840 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments