Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-07-2021 మంగళవారం దినఫలాలు - గోపూజ చేసినా సర్వదా శుభం

Advertiesment
27-07-2021 మంగళవారం దినఫలాలు - గోపూజ చేసినా సర్వదా శుభం
, మంగళవారం, 27 జులై 2021 (04:02 IST)
మేషం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఇంటి కోసం విలువైన ఫర్నీచర్ సమకూర్చుకంటారు. రాజకీయాల్లో వారికి ఆందోళన అధికమవుతాయి. 
 
వృషభం : ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయాల్లో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మిథునం : ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పువ. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి సమస్యలు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రేమికులకు పెద్దల వైఖరి ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
కర్కాటకం : ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి మొహమ్మాటం ఎదురయ్యే అవకాశం ఉంది. ఓర్పుతోనే మీ పనులు సానుకూలమవుతాయి. ప్రముఖులకు విలువైన కానుకలందించి వారికి మరింత చేరువఅవుతారు. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలు టీవీ, చానెల్స్ కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. 
 
సింహం : సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఖర్చులు అధికం కావడం వల్ల ఆందోళనకు గురవుతారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత ప్రయాసలెదుర్కొంటారు. 
 
కన్య : పెద్దల సలహాను పాటించి మౌ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. అనుకోని ఖర్చులు ఇతరాత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
తుల : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అతిగా సంభాషించడం వల్ల అనర్థదాకయం అని గమనించగలరు. నిర్మాణ పనులలో నాణ్యతా లోపం వల్ల స్వల్ప అవాంతరాలు తలెత్తుతాయి. 
 
వృశ్చికం : బంధువుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. వేళతప్పి ఆహారం భుజించుట వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తగలవు. ప్రయాణాలు వాయిదాపడతాయి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి అవకాశాలు లభిస్తాయి. 
 
ధనస్సు : భాగస్వామ్యుల మధ్య అవగాన లోపిస్తుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబీకుల కోసం మంచి మంచి ప్రణాళికలు వేస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
మకరం : కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఎదుటివారిని బాగుగా గౌరవిస్తారు. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. కొన్ని సమస్యలు మబ్బు వీడినట్టుగా వీడిపోవును. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
కుంభం : భాగస్వామికులతో అభిప్రాయభేదాలు తలెత్తే సూచనలున్నాయి. ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. స్త్రీలకు అయిన వారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. వ్యవసాయ, తోటల రంగాల వారిక వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. పెండిగ్ వ్యవహారాలలో కూడా పురోభివృద్ధి పొందుతారు. 
 
మీనం : రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. బంధువుల నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలుకాగలవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-07-2021 సోమవారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా...