Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-07-2021 శనివారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని ఆరాధించినా...

Advertiesment
24-07-2021 శనివారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని ఆరాధించినా...
, శనివారం, 24 జులై 2021 (04:00 IST)
మేషం : ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. కుటుంబానికి వీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన  తప్పదు. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. 
 
వృషభం : ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిదికాదు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. 
 
మిథునం : చీటికిమాటికి ఎదుటివారిపై అసహనం ప్రదర్శిస్తారు. ఏదో ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. పాత రుణాలు తీరుస్తారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. దుబారా ఖర్చులు అధికం. 
 
కర్కాటకం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. మీ శ్రీమతి వైఖరి చికాకుపరుస్తుంది. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
సింహం : ఆదాయానికి మించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. నూతన దంపతులకు ఎడబాటు, చికాకులు తప్పవు. కష్టకాలంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. పాత బాకీల వసూలులో శ్రమధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. 
 
కన్య : ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం అధికమవుతుంది. మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రశంసలు పొందుతారు. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దలకు అకాల భోజనం, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. 
 
తుల : కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు అధికం. బంధు మిత్రులను కలుసుకుంటారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతోపాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. 
 
వృశ్చికం : వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో శ్రమాధిక్యత, చికాకులు అధికం. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. మీ కృషికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. సంతానం భవిష్యత్‌పై శ్రద్ధ వహిస్తారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులు ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. 
 
ధనస్సు : ప్రింటింగ్ రంగాలలో వారికి పై అధికారులతో మాటపడక తప్పదు. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులు సంభవిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టిసారించండి. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. చిన్నారుల విషయంలో పెద్దలగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. 
 
మకరం : తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి ఇతర దేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థినులకు తోటివారి కారణంగా మాటపడవలసి వస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. 
 
కుంభం : ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఫర్నిచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. పెద్దల ఆరోగ్యంలో వైద్యుని సలహా తప్పదు. ఇంజనీరింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
మీనం : ఉద్యోగస్తులు అధికారుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనపరుస్తారు. పాత వస్తువలను కొన్ని సమస్యలను తెచ్చుకోకండి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం తప్పదు