Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-07-2021 దినఫలాలు - సత్యదేవుని అర్చించినా శుభం

Advertiesment
21-07-2021 దినఫలాలు - సత్యదేవుని అర్చించినా శుభం
, బుధవారం, 21 జులై 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలకు పని ఒత్తిడి వల్ల ఆరోగ్యంలో ఒత్తిడి, చికాకులు తప్పవు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. 
 
వృషభం : దైవ సేవా కార్యక్రమాలలో కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. సిమెంట్, ఐరన్, రంగాల్లో వారికి పురోభివృద్ధి. ఉన్నత విద్య, న్యాయ రంగాల వారు కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు. రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మిథునం : మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రశంసలు పొందుతారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు అనుకూలిస్తాయి. చిన్నారుల, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. విందులలో పరిమితి పాటించండి. మీచుట్టుపక్కల వారితో సంభాషించేటపుడు మెళకువ వహించండి. స్త్రీలకు స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక స్ఫురిస్తుంది. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. 
 
సింహం : బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. విద్యార్హతలు పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం మంచిది. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
కన్య : వీలైనంత తక్కువగా మాట్లాడి ఎదుటివారి నుంచి సమాచారం రాబట్టేందుకు యత్నించండి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు లేకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. 
 
తుల : విదేశీయానం నిమిత్తం చేస్తున్న యత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజులు. స్త్రీలు ఆహార విషయంలో పరిమితి పాటించండి. దుబారా ఖర్చులు అధికం. మత్స్యు, కోళ్ల, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ముఖ్యుల వల్ల మీ పనులు వాయిదాపడతాయి. 
 
వృశ్చికం : పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. ఉన్నత స్థాయి ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. శత్రువులు మిత్రులుగా మారతారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు లభిస్తాయి. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
ధనస్సు : సమయానికి మిత్రులు సహకరించకపోవడంతో అసహనానికి గురవుతారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రవాణా రంగాల వారికి ఏకాగ్రత, మెళకువ అవసరం. రుణ విముక్తులు కావడంతోపాటు తాకట్లను విడిపించుకుంటారు. ఫ్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు అనుకూలిస్తాయి. 
 
మకరం : కుటుంబీకులతో, బయటివారితో ఏకీభవించలేరు. ఉపాధ్యాయులకు ఆకస్మిక బదిలీ వల్ల ఒడిదుడుకులు తప్పవు. బ్యాంకింగ్ వ్యవహారాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. స్త్రీలకు ఖరీదైన వస్తు కొనుగోళ్ళలో ఏకాగ్రత అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. 
 
కుంభం : బంధు మిత్రుల రాకతో గృహంలో కొంత అసౌకర్యానికి లోనవుతారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి నష్టాలను పూడ్చుకుంటారు. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనగురవుతారు. సృజనాత్మకంగా వ్యవహరించినపుడు మాత్రమే లక్ష్య సాధన వీలవుతుందని గ్రహించండి. 
 
మీనం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల ఏకాగ్రత, మెళకువ అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-07-2021 గురి పూర్ణిమ, ఏం చేయాలి?