Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16-07-2021 శుక్రవారం దినఫలాలు - నారాయణుడుని తెల్లని పూలతో ...

webdunia
శుక్రవారం, 16 జులై 2021 (04:00 IST)
మేషం : ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి. రావలసిన ధనం చేతికి అందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. మీ నైపుణ్యతకు, సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. 
 
వృషభం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
మిథునం : ఐరన్, సిమెంట్, కలప రంగాలలోని వారికి నిరుత్సాహం తప్పదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కళంకారీ రంగాలలో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 
 
కర్కాటకం : స్త్రీలకు తల, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మలను నిరాశపరుస్తుంది. రవాణా రంగంలోని వారికి లాభదాయకం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు సామాన్యం. 
 
సింహం : ఉమ్మడి నిధులు నిర్వహణలో ఆచితూచి వ్యవహరించండి. విదేశాలు వెళ్లుటకు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగాల వారికి విత్తన కొనుగోళ్లపై అవగాహన ముఖ్యం. దైవ, ఆరోగ్యం విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. 
 
కన్య : ఆర్థికంగా ఎదగడానికి మీకు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. కోళ్ళు, మత్స్యు, గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన ఎదుర్కొంటారు. రావలసిన బకాయిలు సంతృప్తిగా రాజాలవు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో అందరిన ఆకట్టుకుంటారు. 
 
తుల : పీచు, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి పనులు కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్ధానాలు నిలుపుకోలేకపోతారు. వాయిదాపడిన పనులు పునఃప్రారంభిస్తారు. మీరు ప్రేమించే వారివల్ల కొంత నష్టపోయే ఆస్కారం వుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. 
 
వృశ్చికం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారలతో చికాకులు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. పొదుపు పకాలు, చిట్‌ఫండ్ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. 
 
ధనస్సు : వ్యాపారాల అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు అధిక శ్రమ, ఒత్తిడికి లోనవుతారు. సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
మకరం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకిత భావం ముఖ్యం. మార్కెట్ రంగాల వారికి ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతత మాత్రంగానే ఉంటుంది. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు ఖాతాదారులను ఆకట్టుకుంటారు. 
 
కుంభం : స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. ఫ్లీడరు నోటీసులు ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. సేవా సంస్థలకు విరాళాలివ్వడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తారు. 
 
మీనం : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ధన వ్యయంతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. ఏ యత్నం ఫలించక నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు. ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ కోసం బాగా శ్రమించాలి. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

15-07-2021 - గురువారం మీ రాశి ఫలితాలు... కుబేరుడిని ఆరాధిస్తే..? (video)