Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-07-2021 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం పఠిస్తే శుభం

Advertiesment
11-07-2021 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం పఠిస్తే శుభం
, ఆదివారం, 11 జులై 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థల్లోని వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులలకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందుతుంది. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో చికాకులను ఎదుర్కొంటారు. ధన వ్యయం చేస్తారు. 
 
వృషభం : నూతన పెట్టుబడులు, ప్రాజెక్టులు, సంస్థల స్థాపనలకు మరికొంత కాలం వేచియుండటం మంచిది. నేడు అనుకూలించని వ్యవహారాలు రేపు అనుకూలించవచ్చు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. 
 
మిథునం : ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
కర్కాటకం : మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. 
 
సింహం : రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో మెళకువ అవసరం. బంధు మిత్రులకు మీరంటే ప్రత్యేకాభిమానం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు ఖాతాదారులను ఆకట్టుకుంటారు. చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. 
 
కన్య : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉండగలదు. మీ శ్రీమతి మొండివైఖరి చికాకు, ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
తుల : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. స్త్రీల అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. ఇతరులకు వాహనం ఇచ్చే  విషయంలో లౌక్యంగా వ్యవహరించడం మంచిదని గమనించండి. 
 
వృశ్చికం : కోళ్ళ, మత్స్యు, పాడి పరిశ్రమ, గొర్రెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి కానవచ్చును. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతంది. మిమ్మలను చిన్నచూపు చూసిన వారే మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. 
 
ధనస్సు : ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. స్త్రీలకు గుర్తింపు లభిస్తుంది. మీ యత్నాలకు సన్నిహితులు, కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యుల కోసం షాపింగులు చేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. 
 
మకరం : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్యం ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. విదేశీయాన ప్రయాణాలు వాయిదాపడతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. సినిమా, విద్య, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కుంభం : ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యుల సహకారం వల్ల సమసిపోతాయి. మీరు ప్రేమించే వారి వల్ల కొంత నష్టపోయే ఆస్కారం ఉంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ఎదైనా అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడగలవు. 
 
మీనం : స్త్రీలు ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కీడు తలెపెట్టే స్నేహానికి దూరంగా ఉండండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రావిచెట్టు వద్ద దీపారాధన చేస్తే సంతానప్రాప్తి...