Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

06-07-2021 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించినా...

06-07-2021 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించినా...
, మంగళవారం, 6 జులై 2021 (04:00 IST)
మేషం : ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలో నెరవేరగలదు. ఏజెంట్లకు బ్రోకర్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. సినీరంగ పరిశ్రమలో వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో సోదరీ, సోదరుల నుంచి చికాకులను ఎదుర్కొంటారు. 
 
వృషభం : ఆర్థిక విషయాల్లో సంతృప్తి. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. బంధు మిత్రాదులయందు అన్యోన్యత తగ్గును. పెద్దల ఆరోగ్యం విషయంలో చికాకులు ఎదుర్కొంటారు. 
 
మిథునం : శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. పీచు, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులు మార్పులపై చేయు యత్నాలు కలిసిరాగలవు. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. 
 
కర్కాటకం : చిన్నతరహా పరిశ్రమల వారికి సంతృప్తి. ఏకాగ్రతతో కృషి చేసిన మీ ఆశయం తప్పక నెరవేరుతుంది. బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
సింహం : అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. బంధు మిత్రుల రాకతో ఆకస్మిక ఖర్చులు ఎదురవుతాయి. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. గృహ అవసరాలకు నిధులు సమకూరుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు చికాకు, ఆందోళన కలిగిస్తుంది. 
 
కన్య : వ్యాపారాలకు పెట్టుబడిపెట్టనపుడు మెళకువ అవసరం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. మిత్ర సహాయములతో మీ పనుల్లో పురోభివృద్ధి కానవస్తుంది. కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భములయందు ధన నష్టము సంభవించును. 
 
తుల : మీ యత్నాలను కొంతమంది నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు కలిసిరాగలవు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మలను వెంటాడుతుంది. 
 
వృశ్చికం : ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. చిన్నారుల విషయంలో పెద్దలగా మీ బాధ్యతలు నిర్వహిస్తారు. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. మీ వాగ్ధాటి, నిజాయితీలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఏకాగ్రతతో కృషి చేసిన మీ ఆశయం తప్పక నెరవేరుతుంది. 
 
ధనస్సు : బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భములందు ధన నష్టము సంభవించును. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ప్రముఖులకు కానుకలు సమర్పించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో రాణిస్తారు. 
 
మకరం : గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిదికాదని గమనించండి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. ముఖ్యంగా, ప్రింట్ మీడియాలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. 
 
కుంభం : మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలగుతారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. స్థిరబుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఇంటి రుణములు కొన్ని తీరుస్తారు. 
 
మీనం : వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. రుణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం వెన్నతో హనుమంతునికి అభిషేకం చేస్తే..?