Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-07-2021 బుధవారం దినఫలాలు - వైద్యనాథుని ఎర్రనిపూలతో పూజించినా...

Advertiesment
28-07-2021 బుధవారం దినఫలాలు - వైద్యనాథుని ఎర్రనిపూలతో పూజించినా...
, బుధవారం, 28 జులై 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక లావాదేవీల పట్ల శ్రద్ధ వహించండి. సాంఘిక, బంధు మిత్రాదుల యందు అన్యోన్యత తగ్గును. మీ వగ్ధాటి, నిజాయితీలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదావకాశాలు లభిస్తాయి. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు పనివారితో ఇబ్బందులు తప్పవు. 
 
వృషభం : స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. వస్త్ర వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సినీ రంగ పరిశ్రమల్లో వారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాల్లో వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. 
 
మిథునం : మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. పీచు, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు లాభదాయకం. ఖర్చులు మీ రాబడికి తగినట్టుగానే ఉంటాయి. 
 
కర్కాటకం : గొప్ప, గొప్ప అవకాశాలు మీ దరిచేరతాయి. ఇసుక క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, చికాకులను ఎదుర్కొంటారు. గృహ మరమ్మతులు, మార్పు, చేర్పులు వాయిదాపడతాయి. మీ యత్నాలను కొంత మంది నీరుగార్చేందుకు యత్నిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి ఊహించిన సమస్యలెదరవుతాయి. 
 
సింహం : ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. భాగస్వామిక చర్చలు, అర్థాంతరంగా ముగించాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. 
 
కన్య : ఆర్థిక లావాదేవీలు అనుకున్న విధంగా సాగుతాయి. కోట్రు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. జాగ్రత్తలు అవసరం. మీ సంతానంపై చదువుల కోసం విదేశాలు వెళ్తారు. రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీయవచ్చు. ఉన్నతంగా ఎదగాలనే మీ లక్ష్యాన్నికి చేరువ అవుతారు. 
 
తుల : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. కుటుంబీకుల మధ్య అవగాహన లోపం, చీటికి మాటికి అందిరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలు, ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. 
 
వృశ్చికం : భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. విద్యార్థినుల అతి ఉత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. వస్త్ర, బంగారం, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు వస్త్ర లాభం వాహన యోగం వంటి శుభఫలితాలు ఉంటాయి. మీరెదురు చూస్తున్న పత్రాలు, రశీదులు అందుకుంటారు.
 
ధనస్సు : స్త్రీలకు వస్త్రలాభం, వాహనయోగం వంటి శుభఫలితాలు ఉంటాయి. మీరెదురు చూస్తున్న రశీదులు అందుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి కలిసిరాగలదు. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలు త్వరగా ముగించుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. 
 
మకరం : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా సంతృప్తి ఉండదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. భూమి, ఇండ్ల వ్యాపారులకు ప్రభుత్వరీత్యా ధనం, ఆదాయం బాగుండును. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి.
 
కుంభం : మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టుల వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్ రావడానికి మరికొంత సమయం పడుతుంది. విద్యార్థినులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. 
 
మీనం : ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. బంధువుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. సత్కాలం ఆసన్నమవుతోంది. మీ ఆలోచనలు పథకాలు క్రియారూపంలో పెట్టండి. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరమేశ్వరుడికి పీతలతో నైవేద్యం, ఎక్కడ?