ఆంధ్రప్రదేశ్‌లో 108 మందికి నెగెటివ్-ముగ్గురికి పాజిటివ్‌

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (13:15 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వెయ్యి ఆరు మంది అనుమానితులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తన అధికారిక బులెటిన్‌లో పేర్కొంది. వీరిలో 135 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపింది. అందులో 108 మందికి నెగెటివ్‌ రాగా, ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని పేర్కొంది. మిగిలిన 24 మంది నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.
 
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రతిపాదించిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో.. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు రైళ్లు నిలిచిపోనున్నాయి. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు రెండు, మూడింటిని అవసరాన్ని బట్టి నడిపించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ముందే ప్రయాణాన్ని ప్రారంభించే దూరప్రాంత రైళ్లు మాత్రం యథావిధిగా గమ్యం వైపు వెళ్లనున్నాయి. 
 
ప్యాసింజర్‌ రైళ్లకు సంబంధించి 2,400 సర్వీసులు, దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లకు సంబంధించి దాదాపు 1,300 సర్వీసులు నిలిచిపోనున్నాయి. నగరంలో తిరిగే 121 ఎంఎంటీఎస్‌ రైళ్లలో రెండు, మూడు మినహా మిగతావాటిని నిలిపేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లోనూ ఆదివారం మెట్రో రైలు సర్వీసులు నిలిచిపోనున్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెగని 'జన నాయగన్' సెన్సార్ పంచాయతీ.. 21కు వాయిదా

హీరోయిన్ అవికా గోర్ తల్లి కాబోతుందా? ఇంతకీ ఆమె ఏమంటున్నారు?

Balakrishna: అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టుల బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Dimple and Ashika: ప్రతి క్యారెక్టర్ లో ఏదో ఒక తప్పు, లేదా లోపం వుంటుంది : డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్

Samantha: మృదు స్వ‌భావిగా క‌నిపిస్తూ, ఎదురుదాడి చేసేంత శ‌క్తివంతురాలిగా సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వినూత్నమైన ఫ్యాషన్ షోకేస్‌లను నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments