Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతీయ పౌర పట్టికపై కరోనా ఎఫెక్టు.. కేంద్రం కీలక నిర్ణయం

Advertiesment
Coronavirus impact
, శనివారం, 21 మార్చి 2020 (12:49 IST)
జాతీయ పౌర పట్టిక (ఎన్.పి.ఆర్)పై కరోనా వైరస్ ప్రభావం పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పౌర పట్టిక కోసం చేపట్టిన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేడో రేపో అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియా కథనాల సమాచారం. 
 
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించిన విషయం తెల్సిందే. మన దేశంలోనూ ఇది శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. ఆరోగ్య‌శాఖ సూచ‌న‌ల మేర‌కు ఎన్‌పీఆర్ ప్ర‌క్రియ‌ను నిలిపివేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 
 
జ‌నాభా లెక్క‌లు, ఎన్‌పీఆర్ చేప‌ట్టే ప్ర‌క్రియ‌ను ఆపేస్తున్న‌ట్లు కొన్ని ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందింది. భారీ స‌మూహాల‌కు దూరంగా ఉండాల‌ని ఆరోగ్య‌శాఖ సూచ‌న‌లు చేసిన నేప‌థ్యంలో ఎన్‌పీఆర్ డేటా సేక‌ర‌ణ‌ను ఆపేయాల‌ని భావిస్తున్నారు. క‌నీసం ఒకనెల రోజుల‌న్నా జనాభా లెక్కల సేకరణతో పాటు.. ఎన్‌పీఆర్‌ను వాయిదా వేయాల‌ని ఒడిశా, ఢిల్లీ ప్ర‌భుత్వాలు కేంద్రాన్ని కోరాయి. 
 
ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎపిడ‌మిక్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిందని, అలాంటి స‌మ‌యంలో ఇంటి ఇంటికి వెళ్లి జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ చేప‌ట్ట‌డం సాధ్యం కాదు అని సెన్సెస్ క‌మిష‌న‌ర్ ఆఫ్ ఇండియా వివేక్‌ జోషి తెలిపారు. అలాగే, ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా కేంద్రానికి లేఖ రాశారు. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో ఎన్పీఆర్‌ను ర‌ద్దు చేయాల‌ని సీఎం ప‌ట్నాయ‌క్ కేంద్రాన్ని కోరారు. మరికొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 
 
ఈ జాబితా సేకరణ కోసం తయారు చేసిన నమూనా సరిగా లేదని ఆరోపిస్తున్నాయి. ఇపుడు కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని తమతమ రాష్ట్రాల్లో ఎన్.పి.ఆర్ చేపట్టేందుకు అనుమతి నిరాకరిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటని పరిశీలించిన కేంద్రం తాత్కాలికంగా ఈ ప్రక్రియను వాయిదావేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం గారూ.. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి.. లేదంటే: శబరి