Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి చేసుకుని.. రైలు పట్టాలపై పడుకుని సెల్ఫీ తీసుకున్నారు..

Advertiesment
పెళ్లి చేసుకుని.. రైలు పట్టాలపై పడుకుని సెల్ఫీ తీసుకున్నారు..
, శనివారం, 21 మార్చి 2020 (09:43 IST)
భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా నివసించిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.. ఓ యువకుడు. కానీ ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఏర్పడటంతో మనస్తాపానికి గురైన ఆ జంట రైలు పట్టాలపై పడుకుని ప్రాణాలు విడిచారు. ఇంకా రైలు పట్టాలపై పడుకుని సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుపత్తూర్‌ జిల్లా ఆంబూరు సమీపం సామరసికుప్పంకు చెందిన కోదండన్‌ కుమారుడు రామదాస్‌ బెంగుళూరులో కూలీపనులు చేస్తున్నాడు. ఆలంగాయం సమీపం పూంగులమ్‌పుదూర్‌కు చెందిన నారాయణస్వామి కుమార్తె నందిని కోవైలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వీరు ప్రేమికులుగా మారారు. ఏడాది క్రితం నందిని వివాహం కాగా, భర్తతో ఏర్పడిన విభేధాల కారణంగా ఒంటరిగా నివసిస్తున్నట్లు రామదాస్‌కు తెలిసింది. అనంతరం ఆమెను కలిసిన రామదాస్‌ ఆమెను ఓదార్చి, ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరు వేర్వేరు వర్గాలకు చెందిన వారు కావడంతో వీరి వివాహానికి అంగీకారం లభించలేదు. 
 
ఈ నేపథ్యంలో, రామదాస్‌ తన ప్రియురాలు నందినితో కలసి గురువారం ఇంటి నుంచి బయటకు వచ్చారు. పెళ్లి చేసుకున్నారు. కానీ ఇరు కుటుంబీకుల ఘర్షణలతో మనస్తాపం చెందిన ప్రేమ జంట వీరవర్‌ ఆలయ సమీపంలోని రైలుపట్టాలపై పడుకొని సెల్ఫీ తీసుకున్నారు. ఆ సమయంలో ఆ మార్గంగా వచ్చిన రైలు కిందపడి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
శుక్రవారం ఉదయం రైలుపట్టాలపై ఇరువురి మృతదేహాలను గుర్తించిన కొందరు జోలార్‌పేట రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆంబూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్ట్... తిరుమల కొండ నిర్మానుష్యం