Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ వ్యాపించిన వ్యక్తితోనే రెండురోజులు గడిపాడు.. కానీ సోకలేదు, ఎలా?

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (23:08 IST)
చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన ఒక యువకుడికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్థారించారు వైద్యులు. ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి చెన్నైకు వచ్చాడు శ్రీకాళహస్తికి చెందిన యువకుడు. విమానంలో చెన్నైకు వచ్చి అక్కడి నుంచి తన స్నేహితుడితో కలిసి కారులో శ్రీకాళహస్తికి వచ్చాడు.
 
మొదట్లో లండన్‌లో యువకుడితో పాటు అతని స్నేహితుడి రక్తనమూనాలను తీసుకుని పరీక్షించారు. అయితే ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరిని విమానంలోకి అనుమతించారు. అయితే శ్రీకాళహస్తికి వచ్చిన తరువాత అతనికి దగ్గు ఎక్కువైంది.
 
దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చారు. రక్తనమూనాలను పరిశీలించిన వైద్యులు అతనికి పాజిటివ్ అని నిర్థారించారు. ఆ యువకుడితో పాటు  రెండురోజులు ట్రావెల్ చేశాడు అతని స్నేహితుడు. అతని దగ్గరే ఉన్నాడు. కానీ అతనికి మాత్రం వైరస్ సోకలేదు.
 
అతనొక్కడే కాదు కుటుంబ సభ్యులతో మరో రెండురోజుల పాటు గడిపాడు ఆ యువకుడు. వారందరి రక్తనమూనాలాను సేకరించి నెగిటివ్ గా తేల్చేశారు వైద్యులు. అయితే ఆ యవకుడు శానిటైజర్స్, మాస్క్ వాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే వైరస్ సోకినట్లు నిర్థారణకు వచ్చారు. 
 
కానీ అతని స్నేహితుడు మాత్రం శానిటైజర్స్‌ను చేతిలో ఉంచుకోవడమే కాకుండా ఎన్.95 లాంటి మాస్క్‌ను వాడటంతో కరోనా వైరస్ సోకలేదని వైద్యులు నిర్థారించారు. అయితే కుటుంబ సభ్యులకు మాత్రం వైరస్ సోకకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments