Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులో కరోనాను డిపాజిట్ చేసిన మహిళ, ఎక్కడ?

Webdunia
సోమవారం, 18 మే 2020 (23:40 IST)
కరోనా వైరస్‌ను డిపాజిట్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా. బ్యాంకులో ఒక మహిళ చేసిన పనికి బ్యాంకు సిబ్బంది మొత్తం క్వారంటైన్ పాలయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పురాణాపూర్ ఎస్బిఐ బ్యాంకులో చోటుచేసుకుంది.
 
హైదరాబాద్ లోని వేంకటేశ్వరస్వామి కాలనీకి చెందిన ఒక మహిళ పురాణాపూర్ లోని ఎస్బిఐ బ్యాంకు వద్దకు వచ్చింది. కంటోన్మెంట్ జోన్ నుంచి ఆమె బ్యాంకుకు వచ్చింది. అయితే ఆ మహిళకు అంతకుముందే కరోనా లక్షణాలు ఉన్నాయి. 
 
డబ్బులు తీసుకునేందుకు పాస్ బుక్ తీసుకెళ్ళింది. బ్యాంకులో స్లిప్ రాసిచ్చి డబ్బులు తీసుకెళ్ళింది. అయితే ఇదంతా శనివారం జరిగింది. ఆ మహిళ ఆదివారం దగ్గు, జలుబుతో బాధపడుతుంటే ఆమెను క్వారంటైన్‌కు తరలించి రక్తపరీక్షలు చేశారు. సోమవారం ఉదయం ఆమెకు పాజిటివ్ రావడంతో ఒక్కసారి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
 
హుటాహుటిన ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళిందో కనుక్కున్నారు. ఎస్బిఐ బ్యాంకుకు వెళ్ళినట్లు గుర్తించి బ్యాంకులో పనిచేసే మొత్తం 17 మందిని క్వారంటైన్‌కు తరలించారు. బ్యాంకును తాత్కాలికంగా మూసివేశారు. మరో నెల రోజుల పాటు బ్యాంకును తెరిచేది లేదని బ్యాంకు సిబ్బంది బోర్డును ఏర్పాటు చేశారు.
 
ఇది కాస్త హైదరాబాద్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది. బ్యాంకు సిబ్బందిని ఇరికించిన మహిళ డబ్బు డ్రా చేయడానికన్నా కరోనాను డిపాజిట్ చేసేందుకు వచ్చిందంటూ జనం తెగ మాట్లాడేసుకుంటున్నారు. అయితే బ్యాంకుల వద్ద పర్యవేక్షణ ఉండాలి. లోపలికి వెళ్ళే వారందరికీ శానిటైజర్లు ఇచ్చి టెంపరేచర్లు చెక్ చేయాలి. కానీ అదేమీ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments