Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో నిండు గర్భిణి సేవలు.. అన్నపూర్ణమ్మ సేవలు అదుర్స్

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (15:43 IST)
Nurse
కరోనా కాలంలో వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వారు అందిస్తున్న సేవలు అంతా ఇంతా కాదు. తాజాగా ఓ నిండు గర్భిణి కరోనా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా కాలంలో.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎనిమిది నెలల గర్భంతో  ధైర్యంగా సేవలందిస్తున్నారు ఏఎన్‌ఎం అన్నపూర్ణ. 
 
రావాడ రామభ ద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆమె జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ రోగులతో పాటు కొవిడ్‌ బాధితులకు సేవలందిస్తున్నారు. గర్భిణిగా ఉన్న సమయంలో కరోనా విధులకు రానవసరం లేదని, ఇంటి వద్ద ఉండాలని వైద్యులు చెప్పినా అన్నపూర్ణ వినలేదు. 
 
వైద్యాధికారి శ్రావణ్‌కుమార్‌ సలహాలతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కూడా పాల్గొంటున్నారు. వాస్తవంగా ఈ పీహెచ్‌సీ పరిధిలో గిరిజనులే అత్యధికం. వారికి కోవిడ్‌పై అవగాహన కల్పిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు.
 
ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ.. ఈ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడికల్ మరియు హెల్త్ స్టాఫ్ అవసరం ఎంతో వుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే సిబ్బంది కొరతతో పేషెంట్లు బాధపడుతున్నారు. "నాకు ఇదే కరెక్ట్ టైమ్ అనిపించింది. రోగులకు సేవ చేస్తాను. నేను ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం కంటే, ధైర్యంగా చికిత్స అందిస్తాను. అలా వారికి చేసే చికిత్సతో వారు కోలుకుంటే ఎంతో సంతోషంగా వుంటుంది.." అంటూ అన్నపూర్ణ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments