Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 70 కరోనా రోగుల అదృశ్యం...

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (09:43 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. దీంతో అటు ప్రభుత్వంతో పాటు.. ఇటు అధికార వర్గాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా వుంటే, కరోనా వైరస్ సోకిన వారిలో పలువురు అధికారులు, వైద్య సిబ్బందిని నానా తిప్పలు పెడుతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకిన 70 మంది కనిపించకుండా పోయారు.

పైగా, పరీక్షల సమయంలో ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాను తప్పుగా ఇవ్వడం వల్ల అదృశ్యమైన వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిందని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. వారిని పట్టుకునేందుకు పోలీసుల సాయం కోరింది. అదృశ్యమైన వారందరూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మలాడ్‌కు చెందిన వారని అధికారులు గుర్తించారు.
 
కరోనా రోగుల అదృశ్యంపై మంత్రి అస్లామ్ షేక్ స్పందిస్తూ, ఆ రోగులంతా ఎక్కడికీ పారిపోయి ఉండరని, వారి ఫోన్ నంబర్లు, చిరునామాను నమోదు చేసుకునే క్రమంలో పొరపాటు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 
 
వారు తమ చిరునామాల్లో పేర్కొన్న చాలా ప్రాంతాలు మురికివాడలకు చెందినవేనని, వారిలో కొందరు వలస కార్మికులు కూడా ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇంకొందరు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయి కూడా ఉండొచ్చన్నారు. కాగా, తప్పిపోయిన రోగుల జాబితాను బీఎంసీ తమకు అందించినట్టు డిప్యూటీ కమిషనర్ ప్రణయ్ అశోక్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments