Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య చితికి నిప్పంటించి... అందులో దూకేసిన భర్త.. ఎక్కడ?

Advertiesment
భార్య చితికి నిప్పంటించి... అందులో దూకేసిన భర్త.. ఎక్కడ?
, మంగళవారం, 23 జూన్ 2020 (15:57 IST)
వారిద్దరీ మూడు నెలల క్రితమే అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ, ఆ నవ వధువు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత భార్య చితికి నిప్పంటించిన భర్త.. అందులో దూకేసి ప్రాణత్యాగానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా భాంగ్రామ్ తలోధి అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కిషోర్ ఖాతిక్ అనే యువ‌కుడు.. రుచితా చిట్టావ‌ర్‌ను పెద్దల అనుమతితో గత మార్చి 19వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. వారి సంసార జీవితంగా సాఫీగానే సాగుతూ వచ్చింది. రుచితా ప్ర‌స్తుతం మూడు నెల‌ల గ‌ర్భిణి కూడా. అయితే, అనారోగ్యంతో ఉన్న త‌ల్లిని చూసేందుకు నాలుగు రోజుల క్రితం ఆమె త‌న పుట్టింటికి వెళ్లింది.
 
త‌న భార్య‌ను ఇంటికి తీసుకువ‌చ్చేందుకు కిషోర్.. ఆదివారం అత్త‌గారింటికి వెళ్లాడు. రుచితా అప్ప‌టికే ఇంట్లో లేదు. ఆమె అదృశ్య‌మైంద‌ని తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు.. చుట్టుప‌క్క‌ల వెతికారు. గ్రామానికి స‌మీపంలో ఉన్న ఓ బావిలో రుచితా మృత‌దేహం ల‌భ్య‌మైంది. దీంతో కిషోర్‌తో పాటు ఆమె త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.
 
ఈ క్రమంలో రుచితా అంత్యక్రియలు సోమ‌వారం నిర్వ‌హించారు. ఆమె చితికి నిప్పు పెట్టిన కాసేప‌టికే కిషోర్ కూడా ఆ చితిలోకి దూకాడు. అక్క‌డున్న వారంతా అత‌న్ని ర‌క్షించారు. మ‌ళ్లీ కాసేప‌టికే.. త‌న భార్య ఆత్మ‌హ‌త్య చేసుకున్న బావి వ‌ద్ద‌కు వెళ్లి.. దూకాడు. దీంతో కిషోర్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే రుచిత ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫలించిన ఇండో - చైనా లెఫ్టినెంట్ స్థాయి చర్చలు.. వెనక్కి తగ్గిన డ్రాగన్ కంట్రీ