హైదరాబాదులో ఒక్కరోజే 42 కరోనా కేసులు.. పురుషులకే ఎక్కువ!

Webdunia
సోమవారం, 18 మే 2020 (09:38 IST)
హైదరాబాదులో కరోనా వైరస్ 42 మందికి సోకింది. ఆదివారం ఒక్కరోజే ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 37, రంగారెడ్డి జిల్లాలో రెండు, వలసదారులకు సంబంధించి మూడు కేసులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని గోషామహల్‌ సర్కిల్‌-14లో ఉన్న జుంగూర్‌బస్తీలో ఆదివారం ఒకేరోజు 15 మందికి కరోనా సోకింది. 
 
జుంగూర్‌ బస్తీలో నివాసం ఉండే ఓ బ్యాంక్‌ ఉద్యోగి (36)కి ఐదు రోజుల క్రితం వైరస్ సోకింది. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు అతని కుటుంబ సభ్యులు, బంధువులను క్వారంటైన్‌కు తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా ఉద్యోగి తండ్రి (56), అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, ఇంట్లోని బంధువులందరికీ కలిపి 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
మరోవైపు పురానాపూల్‌ చౌరస్తాలోని ఎస్‌బీఐ శాఖ నుంచి ఇటీవల నగదు డ్రా చేసుకొని వెళ్లిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్యశాఖ అధికారులు బ్యాంక్‌లో పనిచేసే 13 మంది సిబ్బంది, అధికారులను క్వారంటైన్‌కు తరలించారు. 
 
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,551కి చేరింది. అందులో వలసదారుల సంఖ్య 57గా ఉంది. ఆదివారం 21 మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 992కు చేరింది. ఇప్పటిదాకా మొత్తం 34 మంది మరణించగా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 525 మంది ఉన్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ప్రియదర్శి, సాయి కుమార్ ల సుయోధన చిత్రం సిద్ధమైంది

Allu Arjun 23: అల్లు అర్జున్ 23 చిత్రం స్పెషల్ థీమ్ సాంగ్ ర్యాంపేజ్

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం

Mark K Robin: గద్దర్ పాటలు కాదు ఫైర్ - ఆయన పేరుతో అవార్డు రావడం ఆనందంగా వుంది : మార్క్ కె రాబిన్

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా హర్షిత్ రెడ్డి దీవాన మూవీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments