తెలంగాణలో 379 కరోనా కేసులు.. చలితో ముప్పు

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (10:14 IST)
తెలంగాణలో కొత్తగా 379 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,88,789కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. బుధవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,553కి చేరింది.
 
కరోనాబారి నుంచి బుధవారం 305 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,82,177కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,053 ఉండగా వీరిలో 2,776 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
ఇకపోతే.. తెలంగాణలో చలితో ముప్పు పొంచి వుంది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. 
 
కొమరిన్ ఏరియా నుంచి ఉత్తర తమిళనాడు వరకు గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ద్రోణితో తూర్పు దిశ నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. 
 
బంగాళాఖాతంలోని తేమ దక్షిణ కోస్తా నుంచి తెలంగాణ మీదుగా రావడంతో ఆకాశం మేఘావృతమై గురువారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. బుధవారం అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: ఫోటోగ్రాఫర్ లోదుస్తులు ఇచ్చి వేసుకోమన్నాడు.. : ఐశ్వర్యా రాజేష్

Suriya: గజిని చాయలున్నా సరికొత్త కథగా సూర్య 46 చిత్రం : నాగవంశీ

విలక్షణ నటుడుగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సుదేవ్ నాయర్

కార్తీక దీపం సీరియల్‌ నటి.. దర్శకుడు విజయ్ కార్తీక్‌కు బ్రేకప్ చెప్పేసింది..

Bobby Kolli: మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన హీరో నవీన్‌ పొలిశెట్టి : దర్శకుడు బాబీ కొల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

తర్వాతి కథనం
Show comments