Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా బీభత్సం - రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 8 జులై 2020 (07:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రికార్డుస్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయ. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈ కేసుల సంఖ్య మరింతగా అధికంగా ఉంది. 
 
ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 1422 కేసులు ఉన్నాయి. 
 
ఓవరాల్‌గా తెలంగాణలో ఇప్పటివరకు 27,612 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడుగురు మృత్యువాత పడగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 313కి పెరిగింది. ఇవాళ 1506 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 11,012 మంది చికిత్స పొందుతున్నారు.
 
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 1422 కేసులు నమోదైతే, రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్‌లో 94, కరీంనగర్‌లో 32, నల్గొండలో 31, నిజామాబాద్‌లో 19, వరంగల్ అర్బన్‌లో 13, పాలమూరులో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments