Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా దెబ్బకు ఉద్యోగాలు ఉఫ్ : 17.7 మిలియన్ల మందికి ఉద్యోగాసు ఊడిపోయాయ్

కరోనా దెబ్బకు ఉద్యోగాలు ఉఫ్ : 17.7 మిలియన్ల మందికి ఉద్యోగాసు ఊడిపోయాయ్
, మంగళవారం, 7 జులై 2020 (11:29 IST)
కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది జీవనోపాధిని కోల్పోతున్నారు. ఫలితంగా దేశంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పటికే 17.7 మిలియన్ల మంది ఉపాధిని కోల్పోయినట్టు పలు సర్వేలు చెబుతున్నారు. 
 
సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ(సీఎంఐఈ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం... క‌రోనా విజృంభణ వల్ల వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు తగ్గిపోవడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు పేర్కొంది. 
 
ముఖ్యంగా, వ్యవసాయం, స్వయం ఉపాధి పనులు దొరుకుతుండటంతో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
 
ఈ యేడాది ఏప్రిల్‌లో 17.7 మిలియ‌న్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. లాక్డౌన్‌ సడలింపులతో మళ్లీ పలు సంస్థలు తెరుచుకోవడంతో గత నెల‌లో 3.9 మిలియ‌న్ల మంది తిరిగి ఉద్యోగాల్లో చేరారని చెప్పింది. 
 
కరోనా విజృంభణ వల్ల విధించిన లాక్డౌన్‌లో సడలింపులు ఇచ్చినప్పటికీ‌ ప‌ట్ట‌ణాల్లో నిరుద్యోగుల సంఖ్య‌ 11.26 శాతానికి పెరిగిందని వెల్లడించింది. దేశంలో నాలుగు వారాల క్రితం నిరుద్యోగ రేటు 10.69 శాతంగా ఉండగా ఇప్పుడు ఇది 11.26 శాతానికి చేరిందని తెలిపింది. 
 
ముఖ్యంగా దేశంలోని క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌, మ‌హారాష్ట్ర, అసోం రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. లాక్డౌన్‌ విధింపు వ‌ల్ల దేశంలో కూలీల కొర‌త ఏర్పడిందని, ఈ పరిస్థితి చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్ర‌భావం చూపుతుందని చెప్పింది. దీంతో ఉద్యోగ భ‌ద్ర‌త‌ అంశం దిగజారుతోందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్‌లో తెలంగాణ జవాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య