Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కోటిన్నర దాటిన కరోనా కేసుల సంఖ్య - యాక్టివ్ కేసులు 2.27 లక్షలు

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (11:01 IST)
దేశంలో మొత్తం కరోనా కేసులో కోటిన్నర దాటాయి. గడచిన 24 గంటల్లో మరో 18088 మందికి కరోనా సోకినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది. అదేస‌మ‌యంలో 21,314 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,74,932కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 264 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,50,114కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,97,272 మంది కోలుకున్నారు. 2,27,546 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటివరకు మొత్తం 17,74,63,405 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,31,408 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 417 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 472 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,410కి  చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,81,872 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య  1,556కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,982మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,748  మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments