Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహిణులకు వంటింటి చిట్కాలు... ఇవి చేసి చూడండి...

మనం తినే ఆహారం రుచిగా వుండాలని కోరుకుంటుంటాం. ఐతే ఎలాబడితే అలా చేస్తే రుచి రాదు కదా. అందుకే కొన్ని చిట్కాలను పాటిస్తే రుచికరమైన పదార్థాలను లాగించేయవచ్చు. చిట్కాలను చూడండి. 1. ముదిరి పోయిన ఆనప గింజల్ని బియ్యంతో కలిపి నానబెట్టి రుబ్బి దోసెల్లా పోసుకుం

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (20:28 IST)
మనం తినే ఆహారం రుచిగా వుండాలని కోరుకుంటుంటాం. ఐతే ఎలాబడితే అలా చేస్తే రుచి రాదు కదా. అందుకే కొన్ని చిట్కాలను పాటిస్తే రుచికరమైన పదార్థాలను లాగించేయవచ్చు. చిట్కాలను చూడండి.
 
1. ముదిరి పోయిన ఆనప గింజల్ని బియ్యంతో కలిపి నానబెట్టి రుబ్బి దోసెల్లా పోసుకుంటే  చాలా రుచిగా ఉంటాయి.
 
2. అర కిలో చపాతి పిండికి రెండు మగ్గిన అరటి పండ్లు ఒక కప్పు పెరుగు చొప్పున కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయి.
 
3. మిగిలి పోయిన అన్నంలో ఎర్రకారం, జీలకర్ర కొంచెం ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి వడియాలుగా పెట్టుకొని ఎండాక వేయించుకొని తింటే భలే రుచి. అయితే వడియాలను చీరల మీద చాపల మీద కాకుండా ప్లాస్టిక్ టేబుల్ క్లాత్ మీద కానీ పాలిథీన్ పేపర్ మీద కాని పెడితే ఎండాక తీసుకోవటం చాలా తేలిక.
 
4. పూరి పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర కలిపితే చాలా సేపటి వరకు తాజాగా ఉంటాయి.
 
5. ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు రెండు ఆముదం చుక్కలు వేసి రుబ్బితే ఇడ్లీ మెత్తగా వస్తుంది.
 
6. నిలువుగా కోసిన ఉల్లిపాయ ముక్కల మీద మెత్తని ఉప్పు వేసి బాగా కలిపితే అవి తడి అవుతాయి. వాటిని కొంచెం శనగ పిండితో కలిపి    వేయించుకుంటే పకోడీలు కరకరలాడతాయి.

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments