వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే సోంపు షర్బత్ మీ కోసం..

సోంపు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది. సోంపు నూనెతో మర్దనచేస్తే కీళ్లనొప్పులూ తగ్గుతాయి. నరాలకూ స్వాంతన కలుగుతుంది. ముఖ్యంగా వేసవిలో సోంపుతో చేసిన పానీయాన్ని తాగితే వేడి తగ్గు

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (12:18 IST)
సోంపు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది. సోంపు నూనెతో మర్దనచేస్తే కీళ్లనొప్పులూ తగ్గుతాయి. నరాలకూ స్వాంతన కలుగుతుంది. ముఖ్యంగా వేసవిలో సోంపుతో చేసిన పానీయాన్ని తాగితే వేడి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. సోంపులో కాపర్‌, ఐరన్‌, కాల్షియం వంటి ఖనిజాలు.. ఏ, బీ, సీ, ఇ విటమిన్లు వుంటాయి. 
 
సోంపుగింజల్ని నమలడంవల్ల లాలాజలంలో నైట్రైట్ల శాతం పెరిగి బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం బీపీకీ గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అలాంటి సోంపుతో షర్బత్ ఎలా చేయాలో చూద్దాం.. వేసవిలో కూల్ కూల్‌గా ఈ షర్బత్ తాగితే శరీర తాపాన్ని తగ్గించుకోవచ్చు. 
 
కావలసిన పదార్థాలు :
సోంపు - పావు కప్పు 
బెల్లం - రెండున్నర స్పూన్, లేదా పంచదార రెండున్నర స్పూన్ తీసుకోవచ్చు. 
తేనె - ఒక స్పూన్ 
వాటర్ - రెండున్నర కప్పులు
లవంగం - రెండు 
 
తయారీ విధానం: 
ముందుగా పొడి చేసిన సోంపు పొడి, కచ్చాచేసిన లవంగాలు రెండు కప్పుల నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. రాత్రి నానబెట్టడం మరిచిపోతే.. రెండు గంటలు నానబెట్టినా సరిపోతుంది. తరువాత వాటిని వడగట్టి అందులో బెల్లం వేసి కలిపి ఒక గ్లాసులో షర్బత్‌ని పోసి ఐస్ ముక్కలు వేసుకుంటే సోంపు షర్బత్ రెడీ అయినట్లే.. ఇందులో మిరియాలు లేదా ఏలక్కాయలు లేదా నిమ్మరసం కలిపితే బాగుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణాలో తొలిసారి సరస్వతీ నది పుష్కరాలు.. ప్రారంభించిన కంచి పీఠాధిపతి

స్నానం చేయమన్న తల్లి.. బావిలో దూకిన కుమార్తె.. ఎక్కడ?

పిల్లలను చూసేందుకు వచ్చిన భర్తను కొట్టి చంపేసిన భార్య

వరంగల్ జంట హత్యల కేసు : ముద్దాయి మరణించేంత వరకు ఉరితీయండి.. కోర్టు తీర్పు

అవినీతి అధికారులను పట్టిస్తే రూ.లక్ష రివార్డు : సీఎం విజయ్ వెల్లడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మెగా 158' ప్రారంభం... అన్న సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు

పొరపాటున కూడా నా కలలోకి రావొద్దంటున్న 'డ్రాగన్'

Sunil Narang: తెలంగాణ వర్సెస్ ఆంధ్రా గా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వుందా?

NBK111 : నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో మనోజ్ మంచు

Manchu Manoj: వడ్డీ కాసుల వాడ గా రాబోతున్న మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments