Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎండలు... వడదెబ్బ తగులకుండా జాగ్రత్తలు

ఎండాకాలం వచ్చేసింది. ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు పాదరక్షలు ధరించాలి. గొడుగును తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. అనుకోకుండా వడదెబ్బ తగిలిన వ్యక్తి తీసుకోవాల

ఎండలు... వడదెబ్బ తగులకుండా జాగ్రత్తలు
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (19:11 IST)
ఎండాకాలం వచ్చేసింది. ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు పాదరక్షలు ధరించాలి. గొడుగును తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. అనుకోకుండా వడదెబ్బ తగిలిన వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
 
1. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి.
 
2. జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి అరస్పూన్ పొడి ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి.
 
3. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్ర పోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.
 
4. వేసవిలో వారానికి ఒకసారయిన కూలింగ్ ఫేస్ ప్యాక్ చేయించుకోవాలి. 
 
5. ఈ కాలంలో ఎక్కువగా మజ్జిగ తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
 
6. ఈ వేసవిలో కీరదోస ముక్కల్ని రెండుపూటలా తినటం వల్ల దీనిలో ఉండే పోషకాలు డీహైడ్రేషన్‌ను దరిచేరనీయవు. మలబద్దక సమస్య కూడా తగ్గుతుంది.
 
7. శరీరంలో నీటి శాతం తగ్గటం వల్ల వడదెబ్బ తగులుతుంది. దీనిని నివారించాలంటే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు తరచూ తాగుతూ ఉండాలి.
 
8. ఈ కాలంలో సలాడ్స్, తాజా కాయగూరలు, ప్రూట్ జ్యూస్‌లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోధుమ రవ్వ ఉప్మా తీసుకుంటే.. డయాబెటిస్ మటాష్