Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం వేడి వేడిగా మష్రూమ్ సూప్ టేస్ట్ చేయండి..

Webdunia
మంగళవారం, 22 అక్టోబరు 2019 (12:48 IST)
వర్షాకాలం వేడి వేడిగా సూప్ తాగాలని వుంటుంది. అందుకే బయిట అమ్మే సూప్‌లను చాలామంది తీసుకుంటుంటారు. కానీ సూప్‌లను ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అది కూడా ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలతో సూప్‌లను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో ఒకటే మష్రూమ్ సూప్. 
 
సాధారణంగా పుట్టగొడుగులు హైబీపీ, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. రక్తనాళాల్లో ఏర్పడే కొలెస్ట్రాల్‌ను నిరోధించి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మష్రూమ్‌లో విటమిన్ డి ఉండటం ద్వారా ఇతరత్రా కాయగూరల్లో లభించని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే లెన్టైసిన్, ఎరిటడెనిన్ అనేవి రక్తంలో కలిసిన డ్రై క్లిస్టరైడ్‌ను తగ్గిస్తుంది. మష్రూమ్స్‌లోని ఎర్రిటైన్ రక్తంలోని కొవ్వును వెలివేస్తుంది. తద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు.
 
మష్రూమ్స్ తీసుకోవడం ద్వారా రక్తం శుద్ధీకరించడంతో పాటు గుండె పనితీరు మెరుగవుతుంది. హృద్రోగ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే వారానికి రెండు సార్లు మష్రూమ్స్ తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా మష్రూమ్స్ హై బీపీని కంట్రోల్ చేస్తుంది. అలాంటి వాటితో వేడి వేడి సూప్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
మష్రూమ్స్‌ - అర కిలో,
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు, 
వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, 
మొక్కజొన్నపిండి - అర టీస్పూన్ 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
వాము పేస్ట్ - అర టీస్పూన్‌, 
చిక్కటి క్రీము - అరకప్పు, 
క్యారెట్‌ తరుగు - అర కప్పు,
మిరియాల పొడి - ఒక టీ స్పూన్‌,
కొత్తిమీర - కొద్దిగా.
ఉప్పు - రుచికి తగినంత. 
 
తయారీ విధానం:  
పాన్‌లో వెన్న వేసి కాస్త వేడి అయ్యాక కట్‌ చేసిన మష్రూమ్స్‌ వేసి వేగించాలి. తగినంత ఉప్పు వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. ఉల్లిపాయలు, అల్లం, క్యారెట్‌ తరుగు వేసి మరికాసేపు వేగించాలి. వాము వేసి కలియబెట్టాలి. సన్నని సెగపై అరగంట పాటు బాగా ఉడికించాలి. తర్వాత చిక్కటి క్రీమ్ చేర్చి.. కలియబెట్టాలి. చిన్నమంటపై మరికాసేపు ఉంచుకోవాలి. మిరియాల పొడి, కొత్తిమీర వేసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేయాలి. ఈ సూప్‌కు కార్న్ చిప్స్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments