ఆపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, వ్యాధులను వ్యతిరేకించే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఆపిల్స్‌లో పెక్టిన్ వంటి ఫైబర్ పుష్కలంగా ఉంది. ఆపిల్ పండ్ల రసంలో యాలకులు, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే కడుపులో మంట, పేగుల్లోని పూత, అజీర్తీ, కడుపు ఉబ్బరం, తేన్పులు, ఛాతీలో మంట తగ్గుతాయి. రోజుకు మూడు ఆపిల్ పండ్లు తింటూ ఉంటే రక్తక్షీణత, శక్తిహీనతల సమస్య తొలగిపోతుంది.
ఎంత మంచి ఆహారం తిన్నా, ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు ఆపిల్స్ తీసుకుంటే ఆరోగ్యంగా వుంటారు. ఇంకా ప్రతి రోజూ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల మతిమరుపు నివారిస్తుంది. అలాంటి యాపిల్‌తో టీ తయారు చేసుకుని సేవిస్తే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.
ఆపిల్ టీ తాగడం వలన రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది భేష్‌గా పనిచేస్తుంది. ఆపిల్ టీ తాగితే శరీర బరువును నియంత్రించుకోవచ్చు. కీళ్ళ నొప్పులు, ఉదర సంబంధిత సమస్యలను ఇది దూరం చేస్తుంది. అలాంటి ఆపిల్ టీ ఎలా చేయాలంటే..
ముందుగా మూడు గ్లాసుల నీటిని ఓ పాత్రలోకి తీసుకోండి. ఆపై శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకున్న ఆపిల్ ముక్కల్ని ఆ నీటిలో చేర్చి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత టీ పొడి, లవంగాలు, దాల్చినచెక్క కొంచెం వేసి కలిపి.. మరికాసేపు మరిగించాలి. అనంతరం కొంచెం తేనెను కలపాలి. ఆపై వడగట్టి కాస్త చల్లబడ్డాక తీసుకుంటే ఫిట్‌నెస్‌కు ఢోకా వుండదు.