Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పకోడీలు ఎలా చేయాలంటే..?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (11:20 IST)
కావలసిన పదార్థాలు:
మామిడికాయ - 1
శెనగపిండి - అరకప్పు
బంగాళాదుంప - 1
ఉల్లిపాయ - 1
అల్లం - చిన్నముక్క
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా మామిడికాయ తొక్కని చెక్కేయాలి. ఆ తరువాత ముక్కలుగా కట్‌చేసి తురిమేసుకోవాలి. అలానే బంగాళాదుంపని కూడా తురుములా తరిగేయాలి. ఆపై ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి కూడా తరిగేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో శెనగపిండి వేసి కొద్దిగా నీళ్లు వేసి కలిపి ఉప్పు, మామిడి తురుము, బంగాళాదుంప తురుము, ఉల్లిపాయ తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టి తరువాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనెను వేడిచేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఆ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని బంగారురంగు వచ్చే వరకు వేయించుకుని తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. అంతే... వేడివేడి మామిడి పకోడీలు రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

తర్వాతి కథనం
Show comments