Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు నచ్చే న్యూడిల్స్ దోసె ఎలా చేయాలో తెలుసా?

ఓ పాత్రలో ఉడికించిన న్యూడిల్స్, నూనె, ఉప్పు చేర్చి పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లి తరుగు, క్యాప్సికమ్, ఉప్పు చేర్చి ఐదు నిమిషాల పాటు దోరగా వేప

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (15:12 IST)
పిల్లలకు స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా...? లంచ్ బాక్సుల్లో ఏం నింపాలని యోచిస్తున్నారా? అయితే పిల్లలకు నచ్చే న్యూడిల్స్‌తో చైనీస్ దోసె ఎలా చేయాలో ట్రై చేద్దాం.. 
 
కావలసిన పదార్థాలు: 
దోసె పిండి - రెండు కప్పులు 
 
మసాలాకు 
అల్లం పేస్ట్- అరస్పూన్ 
వెల్లుల్లి పేస్ట్ - అర స్పూన్ 
సన్నగా తరిగిన క్యాప్సికప్ ముక్కలు - పావు కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు 
ఉడికించిన ఎగ్‌లెస్ న్యూడిల్స్ - రెండు కప్పులు 
సోయా, చిల్లీ సాస్ - తలా రెండేసి స్పూన్లు 
టమోటా సాస్- రెండు స్పూన్లు 
మిరియాల పొడి- అర స్పూన్ 
నూనె- తగినంత 
ఉప్పు-చిటికెడు
 
తయారీ విధానం:  
ఓ పాత్రలో ఉడికించిన న్యూడిల్స్, నూనె, ఉప్పు చేర్చి పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లి తరుగు, క్యాప్సికమ్, ఉప్పు చేర్చి ఐదు నిమిషాల పాటు దోరగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులో న్యూడిల్స్ చేర్చాలి. బాగా వేగాక సోయా, చిల్లీ, టమోటా సాస్, మిరియాల పొడి చేర్చి పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆపై దించి పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద దోసె పెనం పెట్టి వేడయ్యాక పిండిని పోసి.. అందులో న్యూడిల్స్ మిశ్రమాన్ని దోసెపై పేర్చాలి. పిండి ఉడికేంత వరకు వుంచి హాట్‌గా సర్వ్ చేస్తే.. పిల్లలు ఇష్టపడి తింటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

తర్వాతి కథనం
Show comments