చెన్నైలో శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం... ఎందుకంటే?

తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు శ్రీరెడ్డి. శ్రీరెడ్డి వ్యాఖ్యలతో తెలుగు సినీ పరిశ్రమలోని కొంతమంది హీరోలు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే తెలుగు సినీపరిశ్రమను వదిలిపెట్ట తమిళ సినీపరిశ్రమలోని వారిపై దృష్టి పెట్టింది. మొ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (17:13 IST)
తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు శ్రీరెడ్డి. శ్రీరెడ్డి వ్యాఖ్యలతో తెలుగు సినీ పరిశ్రమలోని కొంతమంది హీరోలు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే తెలుగు సినీపరిశ్రమను వదిలిపెట్ట తమిళ సినీపరిశ్రమలోని వారిపై దృష్టి పెట్టింది. మొదటగా ఖుష్భూ భర్త సుందర్ పైన ఆరోపణలు చేశారు శ్రీరెడ్డి. 
 
ఆ తరువాత ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ పైన ఆరోపణలు చేశారు. అవకాశాల కోసం అమ్మాయిలను వాడుకోవడంలో లారెన్స్ సిద్ధహస్తుడంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అంతేకాదు లారెన్స్ కొంతమంది అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు కూడా తన వద్ద ఉన్నాయంటూ బాంబు పేల్చారు శ్రీరెడ్డి. వీడియోలను ఆధారంగా చేసుకుని లారెన్స్ పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇది కాస్త తీవ్ర చర్చకు దారితీసింది.
 
అంతేకాదు ఈ విషయాన్ని తమిళ సినీ సంఘం అధ్యక్షుడు విశాల్ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. శ్రీరెడ్డి అనసవరంగా హీరోలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన వద్ద ఆధారాలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలే తప్ప వాట్సాప్‌లలో ఇష్టమొచ్చినట్లు పోస్ట్‌లు చేసి హీరోల గౌరవాలు దెబ్బతినేలా వ్యవహరించడం దారుణమన్నారు విశాల్. దీంతో చెన్నై నగరంలో పోలీసులకు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా శ్రీరెడ్డిని అరెస్టు చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట. రేపు లేదా ఎల్లుండో శ్రీరెడ్డిని అరెస్టు చేయనున్నారని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై చిల్డ్రన్ మూవీగా సమ్మర్ హాలిడేస్

Akira Nandan: అకీరా నందన్ ఫస్ట్ మూవీ ఎవరితో తెలుసా?

నా జీవితంలో ఆ కథ ముగిసిపోయింది : మంచు లక్ష్మి

నటి ప్రత్యూషను 10 మందితో గ్యాంగ్ రేప్ చేయించి చంపేసాడు, కుక్కచావు చస్తాడు: తల్లి ఆవేదన

Anupama Parameswaran: క్రేజీ కల్యాణం నుంచి అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments