15 పోస్టుల భర్తీ.. ఐఈఎస్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (13:25 IST)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ 2020 (ఐఈఎస్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈసారి 12 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసేందుకు 2020 సెప్టెంబర్ 1 చివరి తేదీ అని ప్రకటించింది. వాస్తవానికి గతంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేయాల్సింది. 
 
కానీ ఖాళీలు లేకపోవడం వల్ల యూపీఎస్‌సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అయితే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ విజ్ఞప్తి మేరకు ఇప్పుడు ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది యూపీఎస్‌సీ. కేవలం 15 పోస్టుల్ని మాత్రమే ప్రకటించింది. 
 
వీరిని కేంద్ర ప్రభుత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్స్‌లో నియమిస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్పీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
 
మొత్తం ఖాళీలు- 15
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 11దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 1
ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ పరీక్ష షెడ్యూల్- 2020 అక్టోబర్ 16 నుంచి 18
విద్యార్హత- ఎకనమిక్స్ లేదా అప్లైడ్ ఎకనమిక్స్ లేదా ఎకనమెట్రిక్స్ లేదా బిజినెస్ ఎకనమిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
వయస్సు- 21 నుంచి 30 ఏళ్ల లోపు 
దరఖాస్తుల విత్‌డ్రా- 2020 సెప్టెంబర్ 8 నుంచి 14
అడ్మిట్ కార్డుల విడుదల- పరీక్షకు 15 రోజుల ముందు తీసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

డానీ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది

Shivani Nagaram: కథలో దిబెస్ట్‌ పిక్‌ చేసుకుంటున్నాను : శివానీ నగరం

2 రోజుల్లో వరల్డ్ వైడ్ 3.96 కోట్ల వసూళ్లు దక్కించుకున్న కపుల్ ఫ్రెండ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

తర్వాతి కథనం
Show comments