టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆ రాష్ట్ర  విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు విజయఢంకా మోగించారు. 
 
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన గురుకుల పాఠశాల విద్యార్థులు, గురువారం విడుదలైన టెన్త్ ఫలితాల్లో కూడా అత్యధికగా 99.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఉత్తీర్ణతా శాతం 75.68 శాతంగా ఉంది. 
 
మరోవైపు, ఆగస్టు ఒకటో తేదీ నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్  సిప్లమెటరీ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. ఈ పరీక్షలు 10వ తేదీ వరకు జరుగుతాయని చెప్పరారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు నిర్వహించనున్నట్టు చెప్పారు. పది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు వచ్చే నెల 18వ తేదీలోపు సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించి ఈ పరీక్షలు రాయొచ్చని వివరించారు. 
 
అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల టైం టేబుల్‌ను పరిశీలిస్తే, 
ఆగ‌స్టు ఒకటో తేదీన ఫ‌స్ట్ లాంగ్వేజ్
ఆగ‌స్టు రెండో తేదీన సెకండ్ లాంగ్వేజ్
ఆగ‌స్టు మూడో తేదీన థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
ఆగ‌స్టు నాలుగో తేదీన మ్యాథ‌మేటిక్స్
ఆగ‌స్టు ఐదో తేదీన జ‌న‌ర‌ల్ సైన్స్(ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ)
ఆగ‌స్టు ఆరో తేదీన సోష‌ల్ స్ట‌డీస్
ఆగ‌స్టు ఎనిమిదో తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
ఆగ‌స్టు పదో తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments