Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ డీఎన్ఏ సీడీఎఫ్‌‌డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్..

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (08:48 IST)
హైదరాబాద్ నగరంలోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) - 'రీసెర్చ్ స్కాలర్స్ ప్రోగ్రామ్-2'లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ కోర్సులో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్, మోడరన్ బయాలజీ సంబంధిత అంశాలపై రీసెర్చ్ వర్క్ ఉంటుంది. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. అభ్యర్థులు కోర్సు పూర్తయ్యే వరకు క్యాంపస్‌లోనే ఉండాలి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. కోర్సులో చేరినవారికి మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ / రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో పీహెచ్ డీ చేసే అవకాశం కల్పిస్తారు.
 
రీసెర్చ్ విభాగాలు : సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటేషనల్ బయాలజీ
 
సీడీఎఫ్‌డీలో రీసెర్చ్ స్కాలర్స్ ప్రోగ్రామ్ : డిసీజ్ బయాలజీ జెనెటిక్స్, మాలిక్యులర్ మైక్రో బయాలజీ ఇమ్యునాలజీ
 
అర్హత వివరాలు : సైన్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినవారు; ఎంబీబీఎస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సెమిస్టర్ పరీక్షలు రాసినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. సీఎస్ఐఆర్/ యూజీసీ/ డీబీటీ/ఐసీఎంఆర్/ఇన్స్పెయిర్/జెస్ట్/యూజీసీ - ఆర్ఎఎన్ఎఫ్ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలో‌షిప్‌నకు అర్హత పొంది ఉండాలి. 
 
జేఆర్ఎఫ్ అర్హత లేని అభ్యర్థులను ఇంటర్వ్యూకి అనుమతించరు. ఐసీఎంఆర్ నుంచి రెండేళ్ల ఫండెడ్ ప్రాజెక్ట్ స్కీమ్ కింద జేఆర్ఎఫ్ పొందినవారు, బీటెక్(బయోటెక్నాలజీ) పూర్తిచేసి డీబీటీ జేఆర్‌ఎఫ్ నెట్ అర్హత ఉన్నవారు, డీబీటీ-2 కేటగిరీ కింద జేఆర్ఎఫ్ నెట్ రాసినవారు, సీఎస్ఐఆర్ - యూజీసీ (నెట్) ద్వారా ఎల్ఎస్ అర్హత పొందినవారు దరఖాస్తుకు అనర్హులు.
 
ముఖ్య సమాచారం : దరఖాస్తుకు చివరి తేదీగా ఏప్రిల్ 27 
 
ఇంటర్వ్యూలు : మే చివరి వారంలో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం: www.cdfd.org.in చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments