Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుజీఈటీ (UGET) 2023 కోసం కొమెడ్‌ కె యుని-గేజ్‌ ప్రవేశ పరీక్ష, అప్లికేషన్‌ తేదీల ప్రకటన

యుజీఈటీ (UGET) 2023 కోసం కొమెడ్‌ కె యుని-గేజ్‌ ప్రవేశ పరీక్ష, అప్లికేషన్‌ తేదీల ప్రకటన
, బుధవారం, 5 ఏప్రియల్ 2023 (17:09 IST)
కొమెడ్‌ కె యుజీఈటీ మరియు యుని-గేజ్‌ ప్రవేశ పరీక్షలు మే 28, 2013 ఆదివారం జరుగనున్నాయి. దాదాపు 150 ఇంజినీరింగ్‌ కళాశాలలు మరియు 50కు పైగా సుప్రసిద్ధ ప్రైవేట్‌ మరియు డీమ్డ్‌ యూనివర్శిటీలలో ప్రవేశాల కోసం ఉమ్మడి పరీక్షగా దీనిని నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలు కర్నాటక అన్‌ఎయిడెడ్‌ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీస్‌ అసోసియేషన్‌ (కెయుపీఈసీఏ) మరియు యుని-గేజ్‌ సభ్య యూనివర్శిటీలలో బీఈ/బీటెక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో భారతదేశ వ్యాప్తంగా 150 నగరాలలో  400కు పైగా టెస్ట్‌ కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ పరీక్షల కోసం ఒక లక్ష మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని అంచనా.
 
ఆసక్తి కలిగిన అభ్యర్థులు comedk.org or unigauge.com వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది, ఈ అప్లికేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లో తెరిచారు. ఏప్రిల్‌ 24, 2023 తేదీ వరకూ దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా  కొమెడ్‌ కె ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ డాక్టర్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘కర్నాటకలో సుప్రసిద్ధ ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే అభ్యర్థులను ఆహ్వానిస్తున్నాం. యుజీఈటీ ద్వారా విద్యార్థులను 150కు పైగా ప్రీమియర్‌ కళాశాలలు అంగీకరిస్తున్నాయి’’ అని అన్నారు
 
ఎరా ఫౌండేషన్‌ సీఈవొ పీ మురళీధర్‌ మాట్లాడుతూ, ‘‘మెరిట్‌ మరియు ఆప్టిట్యూడ్‌ మాత్రమే విద్యార్ధులు తమ విద్యను మరింతగా ముందుకు తీసుకుపోవడానికి కీలకమని భావిస్తున్నాము. యుని-గేజ్‌ ఒక టెస్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా అత్యున్నత ప్రమాణాలతో  ఈ పరీక్షలను  నిర్వహిస్తున్నాము. రేపటి శ్రామికశక్తి యొక్క సమగ్ర అభివృద్ధికి మా వంతుగా తోడ్పడనున్నాము’’ అన్నారు. అప్లికేషన్‌, పరీక్ష ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌ పరీక్ష, దరఖాస్తు ప్రక్రియ సమాచారం విద్యార్ధుల కోసం comedk.org or unigauge.com వద్ద లభ్యమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్‌లో లాటరీ టిక్కెట్ కొన్నాడు.. రూ.44 కోట్ల ప్రైజ్ మనీ గెలిచాడు..